విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ నిరసన చేపట్టారు. ప్రైవేటీకరణ అంశాన్ని నిలిపేంతవరకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని స్పష్టం చేశారు. జీవీఎంసీ గాంధీ పార్కులో అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన 18వ రోజు నిరవధిక నిరాహార.. దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ నిరసన - విశాఖ జిల్లా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని నిలిపేంతవరకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని.. జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హెచ్చరించింది.
![స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ నిరసన agitation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11456731-963-11456731-1618813108465.jpg)
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్మికుల నిరసన