విశాఖ మహా నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహించనున్నారు. అనంతరం లెక్కింపు ఉంటుంది. వైకాపా, తెదేపా నుంచి మొత్తం 20 మంది బరిలో నిలిచారు. 96 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 48 ఓట్లు వస్తే స్థాయి సంఘంలో గెలుపు ఖాయం అవుతుంది.
ఈ ఎన్నిక పూర్తి అయితే కౌన్సిల్ మీద భారం తగ్గి... రూ.20 నుంచి రూ. 50 లక్షల లోపు పనులకు సంబంధించిన నిర్ణయాలు, లావాదేవీలకు, అనుమతి ఇచ్చే అవకాశం స్థాయి సంఘానికి దక్కుతుంది. తేదేపా, వామపక్షాలు సంఖ్యాపరంగా ఎక్కువ స్థానాల్లో ఉండడంవల్ల ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది.