పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలంటూ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విశాఖలో భిక్షాటన నిర్వహించారు. గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో ఖాళీప్లేట్లతో నిరసన ప్రదర్శన చేశారు. అధికారులు వెంటనే స్పందించి బకాయి వేతనాలు చెల్లించాలని, లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'వేతనాలు చెల్లించాలంటూ ఖాళీప్లేట్లతో నిరసన' - జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు విశాఖలో భిక్షాటన నిర్వహించారు. అధికారుల తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో ఖాళీప్లేట్లతో వినూత్న ప్రదర్శన చేపట్టారు. పెండిగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని.. లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా