విశాఖలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత - gvmc-personnel-demolish-a-building
05:16 April 25
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ ఘటనపై పల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. విశాఖలోని పాత గాజువాక సెంటర్ వద్ద అనుమతులు లేకుండా పల్లా శ్రీనివాసరావు భవనాన్ని నిర్మిస్తున్నారని జీవీఎంసీ సిబ్బంది ఈ చర్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పల్లా శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి