ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో మాంసం దుకాణాలపై అధికారుల దాడులు - Visakhapatnam crime

విశాఖలో నిబంధనలు అతిక్రమించి మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మాంసం, చికెన్, చేపలు, రొయ్యలు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాదారులకు జరిమానా విధించారు.

GVMC officers  raids on meat shops in Visakhapatnam
విశాఖలో మాంసం దుకాణాలపై అధికారుల దాడులు

By

Published : May 30, 2021, 8:19 PM IST

విశాఖ నగరంలో నిబంధనలు అతిక్రమించి చేపలు, మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ ప్రత్యేక స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున నేడు నగరంలో చేపలు, మాంసం అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. ఈక్రమంలో నిబంధనలు అతిక్రమించి మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మాంసం, చేపలు, రొయ్యలు, చికెన్​ స్వాధీనం చేసుకున్నారు. పలు దుకాణాదారుల నుంచి రూ.44,200 అపరాధ రుసుం వసూలు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను డంపింగ్ యార్డ్​కు తరలించి గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.

ఇదీచదవండి.

Earthquake: నెల్లూరు జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనకు గురైన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details