ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలోని రోడ్లకు ఎట్టకేలకు మరమ్మతులు

ప్రకృతి విపత్తులతో ఛిద్రమైన రోడ్లను బాగు చేసే పనిలో పడింది జీవీఎంసీ(మహా విశాఖ నగర పాలక సంస్థ). కొన్ని రోజులుగా పెండింగ్​లో ఉన్న పనులకు అనుమతులు మంజూరు చేసి చకచకా టెండర్లు పిలుస్తున్నారు. రోడ్ల మరమ్మతుల కోసం వినూత్న సాంకేతికతను తీసుకొస్తున్నారు.

vishaka roads
vishaka roads

By

Published : Dec 5, 2020, 4:28 PM IST

అక్టోబరులో తీవ్ర వాయుగుండం, నవంబరులో నివర్‌ తుపానుతో నగర రోడ్లు బాగా ఛిద్రమయ్యాయి. అత్యవసరంగా కొన్నిచోట్ల గోతులు పూడ్చే పనులు మొదలుపెట్టినా అవి కొంతవరకే జరిగాయి. అనకాపల్లి మినహా జీవీఎంసీలోని 6 జోన్లలో అప్పటినుంచి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన అనుమతులు ఆలస్యమవడంతో ఇబ్బందులు తలెత్తుతూ వచ్చాయి. తాజాగా మంజూర్లను వేగవంతం చేయడంతో చకచకా టెండర్లు పిలుస్తున్నారు. కొన్ని రోజులుగా రూ.2.23 కోట్ల విలువ చేసే టెండర్లను పిలిచారు. మరికొన్నింటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఈనెలలో టెండర్లన్నీ పిలుస్తామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.

శివారుకే పెద్దదెబ్బ!

ప్రత్యేకించి శివారు ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ తక్కువగా ఉండటంతో ఇంకా ఎక్కువ కోతకు గురయ్యాయి. జోన్‌-1, 5, 6, భీమిలి ప్రాంతాల్లో రోడ్లు ముక్కలయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లోనే 83శాతం నిధుల్ని వెచ్చిస్తున్నారు. ఈ నెలలో పిలిచే టెండర్లతో ఈ రోడ్లు బాగుపడతాయనే భావన వ్యక్తమవుతోంది. జీవీఎంసీ వ్యాప్తంగా మరమ్మతుల కోసం రూ.25.30కోట్లను ఖర్చు పెడుతున్నారు.


వినూత్న పద్ధతుల్లో...
తాజా మరమ్మతుల కోసం వినూత్న సాంకేతికతలను తీసుకొస్తున్నారు. కొత్తగా జెట్‌ప్యాచర్, ఇన్‌స్టామిక్స్‌ లాంటి వాటితో రోడ్లను అక్కడక్కడా వేస్తున్నారు. గంటలోపే పనైపోయి వాహనాలు వెళ్లేందుకు సిద్ధం చేసేలా ఈ సాంకేతికత పని చేస్తుంది.

వేగం పెంచుతున్నాం...

పనుల్ని యుద్ధప్రాతిపదికన చేసేందుకు ప్రత్యేక యంత్రాల్ని తెప్పించాం. జోన్‌1, 4, 5ల్లో కొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయి. ఇంకా వేగం పెంచుతాం. త్వరలో మార్పు కనిపిస్తుంది - ఎం.వెంకటేశ్వరరావు, ప్రధాన ఇంజినీరు, జీవీఎంసీ

ఇదీ చదవండి

రహదారులకు మరమ్మతులు చేయాలని భాజపా రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details