విశాఖలో త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వేళ.. అభివృద్ధి దిశలో స్థానిక ప్రజల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి. నగరాభివృద్ధి దిశగా సరికొత్త అడుగులు పడతాయని ఆశిస్తున్నారు. 2012 నుంచి జీవీఎంసీ ఎన్నికలు జరగనందున.. ఏ అభివృద్ధి ప్రణాళిక అయినా పూర్తిగా అధికారుల ఆలోచనలకు అనుగుణంగానే ఉంటూ వచ్చింది. ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి సమూలంగా మారనుంది. విశాఖ నలుమూలలకూ అభివృద్ధి విస్తరించేలా అనేక కీలక అంశాలపై పాలక మండలి దృష్టి సారిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
పుర పోరుతో విశాఖలో సందడి - విశాఖలో మున్సిపల్ ఎన్నికలు
అభివృద్ధికి చిహ్నమైన విశాఖ నగరం.. పుర పోరుతో మరింత సందడి నెలకొంది. సాగర నగరంలో.. కనిపించే హంగులతో పాటు వెలుగులోకి రాని సమస్యలూ ఎన్నో ఉన్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత పాలక మండలి ఏర్పాటు కానుండగా.. అభివృద్ధి ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Gvmc Election
శివారు ప్రాంతాలతో నగరం అనుసంధానం, మౌలిక వసతుల కల్పన చేపడితే విశాఖ మరింత విస్తరించి, ప్రజా జీవనం మెరుగుపడుతుందని పలువురు సూచిస్తున్నారు. పునర్విభజన తర్వాత విశాఖ నగరంలో వార్డుల సంఖ్య 72 నుంచి 98కి పెరిగింది. నగరాభివృద్ధికి తోడ్పడే చేసే రీతిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:10 అంశాలతో తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో