విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి... విశాఖ మహానగర పాలక సంస్థకు సరఫరా చేస్తున్న తాగునీటి కాలువలో పూడికతీత పనులు చేపడుతున్నారు. రైవాడ జలాశయం నుంచి విశాఖకు 58.4 కిలోమీటర్ల పొడవు ఉన్న తాగునీటి కాలువలో పూడికతీత పనులకు రూ.1.9 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఏఈఈ భరత్ చెప్పారు. ఈ పనుల కారణంగా జలాశయం నుంచి తాగునీటి సరఫరా నిలిపివేశామన్నారు. వీలైనంత త్వరగా పూడికతీత పనులు పూర్తిచేసి, నీటి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.
తాగునీటి కాలువలో పూడికతీత పనులు - జీవీఎంసీ తాగునీటి కాలువ పూడికతీత పనులు
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.1.9 కోట్లు ఖర్చు చేసి ఈ పనులు చేపడుతున్నట్లు ఏఈఈ భరత్ తెలిపారు.
రూ.1.9 కోట్లతో జీవీఎంసీ తాగునీటి కాలువ పూడికతీత పనులు