ఉద్యోగుల మెరుపు సమ్మె.. విశాఖ మేయర్ సహా నగరమంతా నీటిసరఫరా బంద్ - జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు సమ్మె
GVMC CONTRACT WORKERS PROTEST : విశాఖ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు మెరుపు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని తొలిసారిగా మేయర్, ప్రజాప్రతినిధుల ఇళ్లు సహా నగరమంతా నీటి సరఫరా ఆపి.. నిరసనలు చేపట్టారు. సమస్య పరిష్కారం కాకపోతే సంక్రాంతి తర్వాత ఏ రోజు నుంచైనా నిరవధిక సమ్మె చేస్తామని నోటీసులో స్పష్టం చేశారు. వేతనాలను గతంలో కంటే తగ్గించడం దారుణమని, లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందంలో పలు అంశాలను జీవీఎంసీ అమల్లో ఉల్లంఘిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
GVMC CONTRACT WORKERS PROTEST