విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలో పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ సృజన సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని వీఎంఆర్టీఏ చిల్డ్రన్ ఎరీనాలో అదనపు కమిషనర్ ఆషా జ్యోతితో కలిసి.. జోనల్ స్థాయి అధికారులు, వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. మార్కెట్ల నుంచి రావాల్సిన ఫీజులు, పన్నులు నూరు శాతం వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 350 కోట్ల రూపాయల లక్ష్యమైతే... ఇప్పటి కేవలం 227.40 కోట్లు మాత్రమే వసూలైందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి 95 శాతం వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలు పెట్టుకున్న అర్జీలను... సిటిజన్ చార్టు ప్రకారం నిర్ణీత గడువులో పూర్తి చేయని పరిపాలనా కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. కొందరు కార్యదర్శులు డైరీలు రాయకపోవటం గమనించిన జీవీఎంసీ కమిషనర్ సృజన... వారి జీతాలను నిలిపేయాలని అధికారులను ఆదేశించారు.