విశాఖలో పారిశుద్ధ్య పనులను జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడో వార్డు పెద్దజాలరిపేట పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి వారి స్పందన తెలుసుకొని, అందుకు అనుగుణంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సామాజిక మరుగుదొడ్లను పరిశీలించారు.
వాటిని ప్రజలు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని... శానిటరీ ఇన్స్పెక్టర్లకు స్పష్టం చేశారు. అక్కడ సముద్రంలో కలుస్తున్న మురుగు నీటిని ఎస్టీపీలకు మళ్లించటానికి ఉన్న అవకాశాలను తెలుసుకున్నారు.