gutka Seize: రాష్ట్రంలో మత్తుపదార్థాల రవాణా, వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా విశాఖ జిల్లా సింహాచలం పీఎస్ పరిధిలో భారీగా గుట్కా, మద్యం బాటిళ్లను డీసీఎఫ్ పోలీసులు సీజ్ చేశారు. అడివివరం జంక్షన్ వద్ద ఏపీ 31 టీఏ 6678 నంబర్ గల కారులో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన ఖైనీ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన రూ.10 లక్షల విలువైన 209 బాక్సుల మద్యం సీసాలను, రూ.7.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మద్యం బాటిళ్లను రాయగడకు చెందిన రవి అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.