అరకు నుంచి అనకాపల్లికి వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గుట్కా సంచులను విశాఖ జిల్లా వి. మాడుగుల పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో భారీ ఎత్తున గుట్కాను తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు సోదాలు చేశామని ఎస్ఐ తెలిపారు. వెల్డింగ్ గ్యాస్ సిలిండర్లు మాటున అక్రమంగా గుట్కాను తరలిస్తున్నట్టు గుర్తించారు. పట్టుకున్న గుట్కా విలువ రూ.1 60 లక్షలు ఉంటుందని వివరించారు. గుట్కా తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా పట్టివేత - araku
విశాఖ జిల్లా అరకు నుంచి అనకాపల్లికి అక్రమంగా తరలిస్తున్న గుట్కా సంచులను వి. మాడుగుల పోలీసులు పట్టుకున్నారు.
గుట్కా