పట్టుబడ్డ గుట్కా, ఖైనీ ప్యాకెట్లను దగ్దం చేసిన అధికారులు - latest news vishakapatnam
సుమారు 4 లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను విశాఖ మారికవలస డంపింగ్ యార్డ్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజి ఆధ్వర్యంలో అధికారులు దగ్ధం చేశారు.
గుట్కా, కైని ప్యాకెట్ల దగ్దం చేసిన అధికారులు
విశాఖ మారికవలస డంపింగ్ యార్డ్లో సుమారు 4 లక్షల విలువచేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజి ఆధ్వర్యంలో అధికారులు దగ్ధం చేశారు. కరోనా సమయంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ గుట్కా, ఖైనీ ప్యాకెట్లను ఆరిలోవ పోలీసులు పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్, జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వీటిని దగ్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రూ.2 లక్షల అపరాధ రుసుము వసూలు చేశామన్నారు.