రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా పెంచాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వెనుక కుట్ర వుందని..తాను వ్యక్తిగతంగా అనుమానించానని చెప్పారు.
ఈ విషయాన్ని నిర్ధరస్తూ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారని అన్నారు. రాజధానిగా విశాఖను చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని అడ్డుకోవటంలో జరుగుతున్న కుట్రగా తాను భావిస్తున్నానంటూ మరోసారి గుడివాడ అమర్నాథ్ అనుమానాన్ని వ్యక్తం చేశారు.