GST_Irregularities_in_Commercial_Taxes_Department_వాణిజ్య_పన్నులశాఖలో_భారీ_కుంభకోణం_రూ_170_కోట్ల _ప్రభుత్వ_ఖాజానాకు_గండి GST Irregularities in Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులే అక్రమాలకు తెరతీశారు. అయినవారికి తక్కువ పన్నులు, జరిమానాలతో సరిపెట్టి 170 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై నెల క్రితమే.. విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఓ మంత్రి జోక్యంతో అక్రమార్కులపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
విశాఖ కేంద్రంగా వాణిజ్య పన్నుల శాఖలో 170 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఈ శాఖకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విశాఖ కార్యాలయాల దస్త్రాలను ఆడిటింగ్ చేసి, అక్రమాలను నిగ్గుతేల్చింది. ప్రభుత్వ ఖజానాకు పన్నులు, జరిమానాలు, వడ్డీల రూపంలో రావాల్సిన 170 కోట్లు జమ కాలేదని వెల్లడించింది. విశాఖలో వాణిజ్య పన్నుల శాఖ ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌గా ఉన్న ఎన్. శ్రీనివాసరావుపై రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి రెండో వారంలో అభియోగాలు నమోదు చేసింది.
Central Excise Society scam సెంట్రల్ ఎక్సైజ్ శాఖ సొసైటీలో నిధుల గోల్మాల్.. తెరపైకి మరికొందరు!
ప్రైవేట్ వెబ్‌సైట్ నిర్వహించి: విశాఖలో జాయింట్ కమిషనర్ హోదాలో ఎన్. శ్రీనివాసరావు పని చేసినప్పుడు జీఎస్టీఎన్ అధికారిక వెబ్‌సైట్‌కు సమాంతరంగా అనుమతి లేని ప్రైవేట్ వెబ్‌సైట్ నిర్వహించారు. 2019 సెప్టెంబర్ 20 నుంచి 2020 జులై18 మధ్య అవకతవకలకు పాల్పడినట్లు.. ప్రాథమిక విచారణలో తేలింది. వాణిజ్య పన్నుల శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో 9 బృందాల ద్వారా ఆడిటింగ్ చేయించారు.
ప్రభుత్వ ఖాజానాకు జమ కాలేదని తేల్చిన అధికారులు: విశాఖ-1, 2 డివిజన్ల పరిధిలోని సర్కిళ్ల కార్యాలయాల్లో దాదాపు 808 ఫైళ్లను తనిఖీ చేశారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ హోదాల్లో ఉన్న 28 మంది అధికారులు డీల్ చేసిన 230 కీలక దస్త్రాల్ని పరిశీలించారు. వీటిలో పన్నుల రూపంలో రావాల్సిన రూ.96 కోట్లు, జరిమానాల రూపంలో వసూలు కావాల్సిన రూ.61 కోట్లు, వడ్డీ, ఇతరాలు కలిపి మరో రూ.13 కోట్ల వరకూ.. ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదని తేల్చారు.
ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకున్నారు: కాలవ శ్రీనివాసులు
మామూళ్లు తీసుకుని మాఫీ: వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో భాగంగా వ్యాపారుల నుంచి స్వాధీనం చేసుకున్న పుస్తకాల్లోని అవకతవకలను.. మామూళ్లు తీసుకుని మాఫీ చేసేశారు. వ్యాపారుల వద్ద పట్టుకున్న వస్తువులకు తగినట్లు పన్ను ఎగవేతపేరుతో డిమాండ్ నోటీసులు పంపారు. ఐతే మామూళ్లు సమర్పించుకున్న వారిని నామమాత్రపు జరిమానాలతో వదిలేసి, కట్టనివారి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేశారు.
Political Pressure from Ministerఓ మంత్రి ఒత్తిడి వల్లే చర్యలు ఆలస్యం: అవకతవకలకు పాల్పడిన వ్యాపారులకు చట్టప్రకారం జరిమానా తప్పనిసరిగా జరిమానా వేయాల్సి ఉన్నా జరిమానా విధించని కేసులు 22 , వడ్డీ వసూలు చేయనివి కేసులు 60 ఉన్నట్టు తేలింది. దాదాపు 30 కేసుల్లో.. విధించిన పన్ను కూడా చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొన్నినెలల పాటు జరిగిన ఈ బాగోతంలో 28 మందికి భాగస్వామ్యం ఉన్నట్టు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. అప్పటి జాయింట్ కమిషనర్ పర్యవేక్షణాలోపం వల్లే.. అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేల్చిచెప్పింది. ఐతే ఓ మంత్రి ఒత్తిడి వల్లే చర్యలకు ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Electricity Smart Meters 'విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో జగన్ భారీ కుంభకోణానికి తెరలేపారు'