ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Politics in AP Universities: విశ్వవిద్యాలయ పాలకవర్గాల స్వామిభక్తి.. ఏకంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు - రాజకీయాలకు అడ్డలుగా యూనివర్శిటీలు

Employees Prefer Politics in AP Universities: ఉన్నత విద్యను రాష్ట్రంలో అధికార పార్టీ గాలికోదిలేసింది. అంతేకాకుండా ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలను రాజకీయ అడ్డాలుగా మార్చేసింది. విశ్వవిద్యాలయాల పాలకవర్గాలు ముఖ్యమంత్రిపై స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నాయి. వారు హద్దుమీరి చేస్తున్న పనులకు యూనివర్శిటిల్లోని విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతోంది.

Politics in AP Universities
యూనివర్శిటీల్లో రాజకీయాలు

By

Published : Jul 12, 2023, 1:43 PM IST

రాజకీయ కేంద్రాల్లా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు

Growing Politics in AP Universities: విశ్వవిద్యాలయాల్లో మంచి పోస్టింగ్ కావాలన్నా.. లేక పాలక వర్గంలో చోటు కావాలాన్నా.. దానికి పెద్ద మేథస్సు అవసరం లేదు. అనుభవం కూడా అంతకన్నా అక్కర్లేదు. అధికార పార్టీ అండదండలుంటే చాలు. ఔను.. ఇప్పుడు వర్సిటీల్లో కీలక పోస్టులు, పాలకవర్గ పదవులకు.. వైఎస్సార్​సీపీ నాయకుల సిఫారసులే ప్రామాణికం. ఉన్నత విద్యను గాలికి వదిలిన జగన్‌ ప్రభుత్వం.. విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అడ్డాగా మార్చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు, మెరుగైన పరిశోధనలను పక్కన పెట్టేసి పాలకవర్గాలు రాజకీయ సేవలో తరిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మితిమీరిన జోక్యంతో విశ్వవిద్యాలయాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది.

ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటివారు ఉపకులపతిగా వన్నెతెచ్చిన విద్యాలయం. కానీ.. ఇప్పుడది రాజకీయాల నిలయంగా మారింది. గతంలో క్యాంపస్‌ బయట జరిగే రాజకీయం.. ఇప్పుడు కాంపౌండ్‌లోకి వచ్చేసింది. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రస్తుత సీఎం జగన్‌ తండ్రి రాజేశేఖర్​రెడ్డి కాంస్య విగ్రహం పెట్టేశారు. అంతేనా ఏకంగా వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రసాదరెడ్డి ఛాంబర్‌లో జగన్‌ జన్మదినోత్సవాలను జరిపారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్​సీపీ నిర్వహించిన సమావేశంలో స్వయంగా పాల్గొని వర్సిటీ పరువు తీశారనే విమర్శలు మూటగట్టుకున్నారు ప్రసాదరెడ్డి.

ఇక రాష్ట్రంలోనే ప్రముఖంగా చెప్పుకునే నాగార్జున యూనివర్సిటీ సంగతి చూద్దాం. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తే నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్‌ నేనేం తక్కువ అన్నట్లు ఏకంగా వర్సిటీ ఆవరణలోనే వైఎస్సార్​ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీ ఆడిటోరియం, అతిథిగృహాలను ఏకంగా వైఎస్సార్​సీపీ కార్యక్రమాలకు కేటాయించారు.

గతేడాది వైఎస్సార్​సీపీ ప్లీనరీ సందర్భంగా మే 8న వర్సిటీలో తరగతులు రద్దు చేశారు. మే 9న సెలవు కూడా ఇచ్చారు. పరీక్షలూ వాయిదా వేసేశారు. ప్లీనరీ వాహనాల పార్కింగ్‌కు వర్సిటీ స్థలాన్ని కేటాయించారు. జగన్‌పై ప్రేమాభిమానం చాటుకోవడంలో ఎక్కడా మొహమాటపడని వీసీ రాజశేఖర్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జన్మదినానికీ.. వర్సిటీ వద్ద ఫ్లెక్సీ పెట్టారు. నాగార్జున వర్సిటీ వీసీ పోస్టును రెండేళ్లపాటు ఖాళీగా ఉంచి ఆ తర్వాత ఇంఛార్జ్‌గా ఉన్న రాజశేఖర్‌నే వీసీగా నియమించారంటే పైరవీలో ఏ స్థాయిలో నడిచాయనేది అర్థం చేసుకోవచ్చు.

విశ్వవిద్యాలయాలు రాజకీయకేంద్రాలుగా మారాయని చెప్పడానికి ఇవి మచ్చుకు కొన్నే. కాకపోతే ఏ ధైర్యంతో వాళ్లు ఇంత బహిరంగంగా స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు? విద్యార్థి సంఘాలు,విద్యావంతుల విమర్శల్ని.. ఎందుకు లెక్క చేయడం లేదు? దానికి కారణం అధికార అండదండలే.! ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సన్నిహితుడు. ఇక ఏయూ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ ఉద్యోగ విరమణ చేసినా మూడుసార్లు పునర్నియమితులయ్యారు. అత్యధికంగా ఆరేళ్లే ఉండాలనే నిబంధనకు ఇక్కడ పాతరేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై విద్యార్థులతో సర్వేకు వీరిద్దరూ సహకరించారని అప్పట్లో విమర్శలు చెలరేగాయి.

"మొత్తం విశ్వవిద్యాలయాలన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి కనుసన్నాల్లోనే నడుస్తున్నాయి. ఏ యూనివర్సిటీలో చూసిన పార్టీల నాయకుల ఫ్లేక్సీలు కనపడుతున్నాయి. యూనివర్శిటీల్లో కనిపించాల్సింది సెమినార్​లు, కాన్ఫరెన్స్​ల ఫ్లేక్సీలు." -నర్సింహారావు, విశ్రాంత అధ్యాపకులు

"ఫైరవీలను నడుపుతు వైస్​ ఛాన్సలర్స్​ అవుతున్నారో.. ఆటోమేటిక్​గా ప్రోఫెసర్స్​ పట్ల రాజకీయనాయకులకు ఉన్న దృక్పథం కూడా మారిపోతోంది. రాజకీయ నాయకులు యూనివర్సిటీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని నా భావన." -వెలగపూడి ఉమామహేశ్వరరావు, ఏయూ మాజీ రిజిస్టార్

అసలు వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయ పాలక వర్గాలు పూర్తిగా రాజకీయ పలుకుబడి కేంద్రాలుగా మారిపోయాయనే విమర్శలున్నాయి. పాలకవర్గ సమావేశాల్లో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పెత్తనం పెరిగేలా ఈ ఇద్దరినీ సభ్యులుగా నియమిస్తూ వైఎస్సార్​సీపీ సర్కార్‌ ఆదేశాలిచ్చింది. వీరు లేకుండా ఈసీ సమావేశాలు పెట్టరాదని, తీర్మానాలు చేయరాదని పేర్కొంది. తద్వారా వర్సిటీల స్వయం ప్రతిపత్తి.. మరింత మంటగలిసింది.

ఏదైనా వర్సిటీ వీసీ పదవికి ప్రభుత్వం మూడు పేర్లు ఎంపిక చేసి.. గవర్నర్‌ పరిశీలనకు పంపాలనే విధానాన్ని.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పక్కన పడేసింది. చట్టానికి సవరణ చేసి, ఒకే పేరును సిఫార్సు చేస్తోంది. ఈ తీరుతో విశ్వవిద్యాలయాలు రాజకీయ అడ్డాలుగా మారిపోయాయి. ఉప కులపతుల నియామకంలో బయోడేటాల పరిశీలన కూడా మొక్కుబడిగా మారిపోయింది. రాజకీయ బలం ఎక్కువ చాటినోళ్లకే పోస్టు కేటాయిస్తున్నారు. సీఎం కార్యాలయంలోని.. ఓ ఐఏఎస్​ అధికారి సతీమణి కోసం ఏకంగా కృష్ణావర్సిటీ వీసీ పోస్టును ఖాళీగా ఉంచారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆమెను అధికారాన్ని వినియోగించి ఏపీకి తీసుకొచ్చారు.

ఇక ఎస్వీ యూనివర్సిటీ వీసీగా తన స్నేహితుడైన రాజారెడ్డిని నియమించేలా.. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్ద మంత్రి చక్రం తిప్పారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వీసీ సుందరవల్లి సీఎం జగన్‌కు స్వయానా బంధువు. ఆమె గతంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా పని చేసిన క్రిస్టోఫర్‌ సతీమణి. అక్రమాస్తుల ఆరోపణల విషయంలో క్రిస్టోఫర్‌పై గతంలో అవినీతి నిరోధక శాఖ విచారణకు అనుమతివ్వగా.. తదుపరి చర్యలను నిలిపివేస్తూ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం 2020 సెప్టెంబరు 24న ఉత్తర్వులు ఇచ్చింది.

రాయలసీమ వర్సిటీలో 200 మంది బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలపై విచారణను అప్పటి విద్యాశాఖ మంత్రి సురేష్‌ జోక్యంతో పక్కన పెట్టారు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో 2010లో అప్పటి వీసీ కుసుమకుమారి నిబంధనలకు విరుద్ధంగా 21 మంది సహాయ ఆచార్యులను నియమించారు. అనంతపురం జిల్లా అధికార పార్టీ ఎంపీ పైరవీతో ఈ నియామకాలు సక్రమమేనని ప్రభుత్వం.. గత ఆగస్టులో ప్రకటించింది. ద్రవిడ వర్సిటీలో బోధనేతర పదవులైన డైరెక్టరు, డిప్యూటీ, సహాయ డైరెక్టర్ల పోస్టులను ఓ ఐఏఎస్‌ అధికారి బంధువు కోసం బోధన పోస్టులుగా మార్చారు. నన్నయ వర్సిటీలో నియామకాలు, సివిల్‌ పనుల్లో అవినీతిపై విచారణను ఓ మంత్రి అడ్డుకున్నారు. స్వయం ప్రతిపత్తితో విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన వర్సిటీలు.. రాయకీయ పడగ నీడలో భ్రష్టు పట్టిపోతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details