ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి - సింహాచలానికి పెరుగుతున్న భక్తుల తాకిడి

సింహాద్రి అప్పన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు నిబంధనలు అమలు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులకు ఆలయం ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదు.

growing-flood-of-devotees-to-simhadri-appanna temple
సింహాచలానికి పెరుగుతున్న భక్తుల తాకిడి

By

Published : Oct 3, 2020, 2:20 PM IST

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దర్శనం కోసం వచ్చేవారు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులను ఆలయంలోకి అనుమతించడం లేదు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, విశేష పూజలు నిర్వహించిన తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సింహాచలానికి పెరుగుతున్న భక్తుల తాకిడి

ABOUT THE AUTHOR

...view details