విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. చింతపల్లిలో సోమవారం 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మంగళవారం మరింత తగ్గి 9.2 డిగ్రీలుగా నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. చలి తీవ్రత పెరగడంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు దట్టంగా పడుతోంది. ఉదయం పదిన్నర గంటల వరకూ ఎండ రావటం లేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. నవంబరు రెండో వారంలోనే చలి తీవ్రత అధికంగా ఉండటంతో రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
చింతపల్లి@9.2 డిగ్రీలు
ఏపీలోని విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నిన్న 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మంగళవారం మరింత తగ్గి 9.2 డిగ్రీలుగా నమోదైంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటే వణికిపోతున్నారు.
chintalapalli cold