ఐదుగురు ప్రముఖులకు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్వానందేంద్ర సరస్వతి స్వామి హరిత ఛాలెంజ్ చేశారు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, తమిళ పత్రిక ఎడిటర్ ఆర్ ఆర్ గోపాల్, పారిశ్రామికవేత్త వైరన్ షా, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందనకు మొక్కలు నాటి పెంచే బాధ్యతతో కూడిన గ్రీన్ ఛాలెంజ్‌విసిరారు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగులపల్లి సంతోష్ చేసిన సవాల్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతలను చూస్తున్నామన్నారు. హరిత పుడమిని చేసేందుకు తాను ఛాలెంజ్ ఇచ్చిన వారు స్వీకరిస్తారని ఆయన ఆక్షాంక్షించారు.
వివిధ రంగ ప్రముఖులకు శారదా పీఠం ఉత్తరాధికారి సవాల్ - వైజాగ్ తాజా వార్తలు
విశాఖ చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్వానందేంద్ర సరస్వతి స్వామి హరిత సవాల్ స్వీకరించారు. మరో ఐదుగురు ప్రముఖులకు ఛాలెంజ్ చేశారు.

హరిత ఛాలెంజ్‌ను స్వీకరించిన శారదా పీఠం ఉత్తరాధికారి
Last Updated : Nov 21, 2019, 12:54 PM IST