విశాఖ జిల్లా దేవరాపల్లి-కొత్తవలస రహదారి... విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు అనుసంధానమైన మార్గం. దేవరాపల్లి నుంచి ఆనందపురం జంక్షన్ వరకు రహదారిపై పూర్తిగా గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతల్లో నీరు చేరి రోడ్డు చెరువును తలపిస్తోంది. రహదారి శిథిలం కావడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఆనందపురం జంక్షన్ నుంచి దేవరాపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులు చేయటానికి గతంలో రూ.23 లక్షలు మంజూరైనా... ఇంకా పనులు చేపట్టలేదు. గతంలో కొత్తవలస నుంచి ఆనందపురం వరకూ రహదారి వెడల్పు చేశారు. ఆనందపురం నుంచి దేవరాపల్లి వరకూ రోడ్డు వెడల్పు చేసేందుకు రూ.14 కోట్లు మంజూరైనా ఇప్పటివరకూ పనులు ప్రారంబించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆనందపురం- దేవరాపల్లి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ రహదారిపై ప్రయాణం... ప్రమాదాలకు ఆస్కారం...! - Granted funds for repairing road in devarapally
అది విశాఖపట్నం-విజయనగరం జిల్లాలకు అనుసంధాన మార్గం. భారీ వాహనాల రాకపోకలు, ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రహదారి స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరైనా ఇంతవరకూ పనులు చేపట్టలేదు. ఆనందపురం నుంచి దేవరాపల్లి వరకూ అధ్వాన్నంగా మారిన రహదారి పరిస్థితిపై ఈటీవీభారత్ కథనం...!
![ఈ రహదారిపై ప్రయాణం... ప్రమాదాలకు ఆస్కారం...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4836601-0-4836601-1571754195149.jpg)
దేవరాపల్లి-కొత్తవలస రోడ్డు మార్గంలో గుంతలు