విశాఖ జిల్లాలోని రావికమతం మండలం అజేయపురం వద్ద సర్వే నంబరు 4లో సుమారు 5 హెక్టార్లకు సంబంధించి.. స్టోన్ ప్లస్ యాజమాన్యం లీజు హక్కులను ప్రభుత్వం నుంచి 2016లో పొందింది. ఈ మేరకు తవ్వకాలు జరుపుతూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి సమీపంలో కళ్యాణపులోవ జలాశయం ఉన్నందున ఈ ప్రాంతంలో క్వారీలకు అనుమతి ఇవ్వడం తగదని ఆదివాసులు, కొంతమంది గిరిజనులు అభ్యంతరం చెబుతున్నారు. జలాశయం సమీపంలో క్వారీలకు అనుమతి ఇస్తే జలాశయం మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గిరిజనుల వాదన. ఈ వివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. దీనిపై క్వారీ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందింది. గ్రానైట్ ను రవాణా చేస్తుండగా గిరిజనులు అడ్డుకున్నారు. వాహనాలు వెళ్లనీయకుండా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు క్వారీ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు పొందితే ప్రభుత్వాన్నీ ప్రశ్నించకుండా తమ వాహనాలు, వ్యాపారాన్ని అడ్డుకోవడం తగదని పేర్కొంటున్నారు.
గ్రానైట్ తవ్వకాలపై చీమలపాడులో వివాదం - విశాఖలో గ్రానైట్ తవ్వకాలు తాజా వార్తలు
విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం చీమలపాడు శివారు అజేయపురం సమీపంలోని గ్రానైట్ క్వారీ తవ్వకాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. ఈ తవ్వకాలు నిలిపివేయాలని కొంతమంది గిరిజనులు వాదిస్తున్నారు. చట్ట పరమైన అన్ని అనుమతులు పొంది ప్రభత్వానికి ఏటా సెస్ చెల్లిస్తూ తవ్వకాలు జరుపుతున్నామని న్యాయస్థానం అనుమతి పొందినా.. తమ వ్యాపారానికి ఆటంకం చేయడం తగదని క్వారీ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
granite quarry Contention in vishaka district