ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరకు ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జాతర మే 11 వరకు జరగనుంది. నెల రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కరోనా కారణంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరకు ముమ్మర ఏర్పాట్లు - news updates in anakapalli
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి జరిగే ఈ జాతరను నెలరోజుల పాటు నిర్వహిస్తారు.
అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరకు ముమ్మర ఏర్పాట్లు