PAWAN TOUR IN VIZAG : విశాఖ పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఆయన బస చేసే నోవాటెల్ హోటల్‌కు తరలివెళ్లారు. పవన్‌వెళ్లే మార్గంలో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు అడుగడుగునా భారీ గజమాలలతో స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని అభిమానులు ఆయన రాకకోసం ఎదురుచూశారు. విమానాశ్రయంలో మంత్రులు, వైకాపా నేతలపై దాడి ఘటన దృష్ట్యా పవన్ వెళ్లే దారిలో అన్ని కూడళ్లలోనూ పోలీసులను మోహరించారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
విశాఖలో పవన్ పర్యటన.. గజమాలలతో జనసైనికుల ఘనస్వాగతం - గజమాలలతో జనసైనికుల ఘనస్వాగతం
PAWAN TOUR IN VISAKHA : విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి నోవాటెల్ వరకు ర్యాలీగా పవన్‌కు కార్యకర్తలు అడుగడుగునా భారీ గజమాలలతో స్వాగతం పలికారు.
PAWAN TOUR IN VISAKHA