కరోనా పోరులో కీలక భూమిక పోషిస్తున్న వైద్యులకు విశాఖలో ఘనంగా స్వాగతం లభించింది. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చెస్ట్ ఫిజిషియన్, నోడల్ అధికారిగా సేవలందిస్తున్న డాక్టర్ అయ్యప్ప, ఆయన భార్య డాక్టర్ ఉష అయ్యప్పను ఎస్.ఆర్.ఎలెజెన్స్ అపార్ట్మెంట్ వాసులు ఘనంగా సత్కరించారు. విశాఖలో కరోనా కేసులు మొదలైన నాటి నుంచి భార్యాభర్తలు ఇద్దరూ తమ సేవల్ని అందిస్తున్నారు. దాదాపు 40 రోజుల తరువాత వారు ఇంటికి రావటంతో ఆ అపార్ట్మెంట్ వాసులు వారిపై పూలుచల్లి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూల మాలలతో సత్కరించారు.
విశాఖలో కరోనా యోధులకు ఘనస్వాగతం - ఏపీ కరోనా వార్తలు
కరోనా వ్యాప్తి చెందుతున్నా వెన్ను చూపకుండా పోరాడుతున్నారు వైద్యులు. వారి ప్రాణాలను ఫణంగా పెట్టి వైరస్ బాధితులకు ఊపిరి పోస్తున్నారు. అలాంటి కరోనా యోధులపై ప్రేమను చాటుకున్నారు విశాఖలోని ఎస్.ఆర్.ఎలెజెన్స్ అపార్టుమెంటు వాసులు.

grand welcome for corona front line warriors