విశాఖ జిల్లాలో గ్రామ / వార్డు సచివాలయ పరీక్షలు రెండో రోజు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం, మధ్యాహ్నం జరిగిన రెండు పరీక్షలకు 69.5 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 30,243 మంది అభ్యర్థులకు 20,897 మంది హాజరయ్యారు. కొవిడ్ పాజిటివ్ అభ్యర్థి ఒకరు హాజరవగా.. ఐసొలేషన్ గదిలో పరీక్ష రాయించారు.
రెండో రోజు పరీక్షకు 69.5శాతం హాజరు - విశాఖలో గ్రామ వార్డు పరీక్షలు
విశాఖ జిల్లాలో రెండో రోజు గ్రామ / వార్డు సచివాలయ పరీక్షలకు 69.5 శాతం మంది హాజరయ్యారు. వారికి ఒకరికి కరోనా ఉన్నందున ఐసోలేషన్ గదిలో పరీక్ష రాయించారు.
![రెండో రోజు పరీక్షకు 69.5శాతం హాజరు gram/ward sachivaly exam at vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8889661-921-8889661-1600745558934.jpg)
విశాఖ జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు