విశాఖజిల్లా నర్సీపట్నంలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా.. పట్టించుకోవటం లేదని గిరిజనులు నిరసన చేపట్టారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. పట్టా భూములు ఇవ్వాలని నినాదాలు చేశారు.
'ఏళ్ల తరబడి సాగు చేస్తున్న గిరిజనులకు పట్టా భూములివ్వాలి' - narsipatnam latest news
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏళ్ల తరబడి సాగు చేసే గిరజనులకు పట్టా భూములు ఇవ్వాలి
రోలుగుంట మండలంలోని గిరిజనులు ఏళ్ల తరబడి అటవీ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు ఇవ్వకపోవటం విచారకరమన్నారు. అటవీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అర్హులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పట్టాలను కేటాయించాలంటూ అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు
ఇదీ చదవండికరోనా ఎఫెక్ట్: మధ్యాహ్నానికల్లా మూతపడుతున్న దుకాణాలు