వచ్చే ఉగాది పండుగకు సొంత ఇళ్లు లేని పేద వారిని గుర్తించి, వారందరికి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అనకాపల్లి ఆర్టీవో సీతా రామారావు తెలిపారు. విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఇళ్లు నిర్మించుకోవటానికి అనువైన ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. అనకాపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అనకాపల్లి, చీడికాడ, మాడుగుల తదితర మండలాల్లో 26,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌కు సంబంధించిన 1,277 ఎకరాలు గుర్తించినట్లు ఆర్టీవో వివరించారు.
ఉగాదికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ - undefined
రాబోయే ఉగాది నాటికల్లా సొంత ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయబోతున్నట్లు అనకాపల్లి ఆర్టీవో సీతా రామారావు వెల్లడించారు.

ఉగాదికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ