రాష్ట్ర అభివృద్ధి, రాజధానులపై నిపుణుల కమిటీ వెయ్యి పేజీల నివేదిక ఇచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. అందులో ఏ విధమైన సందేహం లేదన్నారు. ఈ విషయంలో ఎవరేం చెప్పినా నమ్మోద్దని రాజధాని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం అమరావతిలోనే ఉండాలని... ఆ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నివేదికలో ఉందని వెల్లడించారు.
'అమరావతి రైతులకు అభివృద్ధి చేసిన భూములిస్తాం' - అమరావతి రైతుల ఆందోళన
అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో వచ్చిన భూమిని అభివృద్ధి చేసి ఇస్తామని పునరుద్ఘాటించారు.
బొత్స సత్యనారాయణ