Governor Visited Sharada Peetam : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్నారు. రాజశ్యామలా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామలా అమ్మవారి దర్శనం కోసం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించడం ఇది రెండోసారని గవర్నరు గుర్తు చేసుకున్నారు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు.. హాజరైన గవర్నర్ - ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బిశ్వభూషణ్
Governor Visited Sharada Peetam : విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. పీఠంలో ఉన్న రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్నారు.
గవర్నర్