ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి: ప్రభుత్వ విప్

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తారువలో 71వ వన మహోత్సవాన్ని పురష్కరించుకొని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మొక్కలు నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.

Whip, MLA Budi Muthyalanayu
మొక్కలు నాటిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు

By

Published : Jul 22, 2020, 6:46 PM IST


ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కోరారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తారువలో 71వ వన మహోత్సవాన్ని పురష్కరించుకొని జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా.. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలు పెరిగేలా చూడాలని ఎమ్మెల్యే ముత్యాలనాయుడు సూచించారు. మొక్కలు పెంచడంతోనే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details