విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అధికారులకు సూచించారు. ఇందుకోసం రూ.69 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. తొలి విడతలో ఈ ఏడాది 38 గ్రామాల్లో రూ.20 కోట్లతో ఇంటింటికీ కుళాయి సౌకర్యానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.