విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం డి.అగ్రహారం యువత గ్రంథాలయం ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు కొనియాడారు. స్వగ్రామం యూత్ అసోసియేషన్ పేరుతో యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నిరుపయోగంగా ఉన్న పాఠశాల భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఆలోచించిన గ్రామానికి చెందిన యువకులు.. ఉన్నతాధికారులను సంప్రదించారు. వారి అనుమతితో పాఠశాల భవనానికి రూ.1.5 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. దాతలు సహకారంతో పిల్లలు నుంచి పెద్దల వరకు అవసరమైన పుస్తకాలను సేకరించి పుస్తకాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రంథాలయం నిర్వాహణకు సహకారాన్ని అందించిన ప్రభుత్వ విప్‌కు యువకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వగ్రామం యూత్ అసోసియేషన్ ప్రతినిధులు గణేష్, సతీష్, రూపేష్ కుమార్లతోపాటుగా పలువురు యువకులు పాల్గొన్నారు.
'గ్రంథాలయం ఏర్పాటుతో.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు' - ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు తాజా వార్తలు
పుట్టి పెరిగిన గ్రామానికి ఉపయోగపడే విధంగా అక్కడ యువత సరికొత్తగా ఆలోచించారు. లాభాలు అర్జించే వ్యాపారాలు కాకుండా అందరికీ ఉపయోగపడే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాలయాన్ని ప్రారంభించారు.
గ్రంథాలయాన్ని ప్రారంభించిన యువకులు
ఇవీ చూడండి...