ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాండవ జలాశయం అభివృద్ధికి రూ. 470 కోట్లు విడుదల

By

Published : Mar 19, 2021, 8:51 PM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 470 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియాకు వెల్లడించారు. ఈ నిధులతో ఏలేరు కాలువ నుంచి నీటిని మళ్లించి మరో రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నట్లు ప్రకటించారు.

government released grant for tandava reservoir
తాండవ జలాశయం అభివృద్ధికి రూ. 470 కోట్లు విడుదల

తాండవ జలాశయం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 470 కోట్లు విడుదల చేసినట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు. విశాఖ, తూర్పుగోదావరిలోని సుమారు 52 వేల ఎకరాలకు నీరందిస్తున్న ఈ పథకం కోసం.. సీఎం జగన్ నిధులు ఇచ్చినట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏలేరు కాలువ నుంచి విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయంలోకి నీరు తరలించేందుకు.. ఎత్తిపోతల పథకం కోసం ఇవి కేటాయించినట్లు పేర్కొన్నారు.

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల రైతులకు.. తాండవ జలాశయం వల్ల పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఇప్పుడు విడుదలైన నిధులతో.. ఏలేరు కాలువ నుంచి నీటిని మళ్లించి అదనంగా మరో రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆండ్ర జలాశయం కింద ఆయకట్టుదారులు, తూర్పు గోదావరి రైతులు.. సీఎం జగన్​కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. నిధుల మంజూరు పత్రాలను విలేకరులకు అందజేశారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details