ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2020, 5:16 PM IST

ETV Bharat / state

చోడవరంలో పీజీ కోర్సులకు ప్రభుత్వం ఆమోదం

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పీజీ కోర్సులు అందుబాటులో ఉంచడం కోసం.. చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాటిని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. సీఎం జగన్​ చొరవతో.. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రజలు ఉన్నత విద్య కోసం పట్టణాలకు వెళ్లే శ్రమ తప్పిందన్నారు.

chodavaram mla
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మూడు పీజీ కోర్సులను మంజురు చేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. పీజీ కోర్సులు చదవాలంటే ఇప్పటివరకు విశాఖ, అనకాపల్లి వెళ్లాల్సి రాగా.. గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అవకాశాలను మెరుగుపర్చిందని పేర్కొన్నారు. సీఎం జగన్ చొరవతో.. చోడవరం, మాడుగుల, నర్సీపట్నంకు చెందిన ప్రజలు ఉన్నతవిద్య కోసం పట్టణాలకు వెళ్లాల్సిన పని లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు కళాశాల విద్య ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్​ను ఆయన విడుదల చేశారు.

భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఎంఎస్సీకి 30 సీట్లు.. ఎంకాంలో 30 సీట్లు చొప్పున కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆయా కోర్సులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. చోడవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు.. వెంకన్నపాలెంలో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. జన్నవరంలో జ్యోతిరావు పూలే కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details