Government primary school : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే గదిలో ఐదు తరగతులతో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. కాగా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి రెండు గదులుండగా.. రెండేళ్ల కిందట నీటి ట్యాంకు కోసం ఓ గదిని కూల్చివేశారు.
ఐదు తరగతులు, అంగన్‌వాడీ.. అన్నీ ఒకే గదిలో.. - AP LATEST NEWS
Government primary school : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కొరవడుతున్నాయి. విద్యావ్యవస్థను పటిష్ఠం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో చూపడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఒకే గదిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను.. అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
అంగన్‌వాడీ
ఉన్న ఒక్క గదిలో అడ్డుగా పరదా కట్టి ఒకవైపు ఐదు తరగతులు.. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆ గదిలోనే మధ్యాహ్న భోజన సామగ్రి, రికార్డులు సైతం ఉంచారు. ఆ బడిలో గతేడాది 78 మంది విద్యార్థులు ఉండగా.. వసతులు లేని కారణంగా ప్రస్తుతం 37 మందికి తగ్గారు.
ఇవీ చదవండి: