విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో తొంభై ఎనిమిది వార్డులున్నాయి. నగరం విస్తరిస్తుండటంతో అత్యవసర సేవలందించేందుకు సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందికి వాకీటాకీలు అందించనున్నారు. ఇదివరకే జీవీఎంసీ పరిధిలో 100 వాకీటాకీలున్నాయి. మరో 200ల వరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటి కోసం రూ.1.03 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, టౌన్‌ప్లానింగ్, మంచినీటి సరఫరా, ఇతరత్రా అభివృద్ధి పనులకు సంబంధించిన విభాగాల్లో ఉన్న సిబ్బందికి వీటి అవసరమెక్కువ. నగరంలో కలిసిన అనకాపల్లి, భీమిలి జోన్లు, మధురవాడ, పెందుర్తి లాంటి శివారు ప్రాంతాల్లో వాకీటాకీ సేవల్లేవు. అక్కడ కూడా ప్రారంభించేందుకు టవర్ల ఫ్రీక్వెన్సీని పెంచేందుకు ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నారు.