విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలల్లోని వ్యాయామ ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. సంఘం ఆధ్వర్యంలో నెలకు సరిపడా సరుకులను పంపిణీ చేశారు. స్థానిక సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జి. రాంబాబు చేతుల మీదుగా సరుకుల్ని అందించారు.
వ్యాయామ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు అందజేత - physical education teachers
కరోనా ప్రభావంతో మూతపడిన పాఠశాలలు ఇప్పటికీ తెరచుకోనేలేదు. దీంతో ప్రైవేటు బడుల ఉపాధ్యాయులు వేతనాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ విపత్కర సమయంలో విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు తమ ఉదారభావాన్ని చాటుకున్నారు.
![వ్యాయామ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు అందజేత supply of essential goods](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9314121-671-9314121-1603692976044.jpg)
నిత్యావసర సరుకులు అందజేత