ప్రభుత్వ భూములు పరిరక్షించి ప్రజా అవసరాలకు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని రామారావు అనే వ్యక్తి అధికారులను కోరారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెంలో 14 ఎకరాల ప్రభుత్వం భూమి అన్యాక్రామంతం అవుతోందని ఆయన ఆరోపించారు. గతంలో కొంతమందికి ఇచ్చిన పట్టాలను... 2007లో ఆనందపురం రెవెన్యూ అధికారులు రద్దుచేసి ప్రభుత్వ భూములుగా ఏర్పాటు చేసుకున్నారు. 13 ఏళ్ల అనంతరం మళ్లీ ఆ భూముల్లో గ్రావెల్ అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. దీంతో పాటు తుప్పలు నరికి... నేలను చుదను చేసి భూములను కబ్జా చేస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు.
'14 ఎకరాల ప్రభుత్వ భూములను పరిరక్షించండి' - anandapuram mandal latest news
14 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతోందంటూ రామారావు అనే వ్యక్తి ఆరోపించారు. ఆనందపురం మండలం బొడ్డపాలెంలో ఉన్న భూములను చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు గుర్తించి వీటిని పరిరక్షించాలని కోరారు.
భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆరోపణ