ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం - government employees escaped from floods in visakha news

స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు వెళ్తుండగా ప్రభుత్వ సిబ్బంది వరద నీటిలో చిక్కుకున్న ఘటన విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధిలో జరిగింది. సమీపంలోని గ్రామస్థుల సహకారంతో సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరి.. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం
వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం

By

Published : Aug 15, 2020, 9:27 PM IST

విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుమ్మలరేవు పంచాయతీలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించేందుకు.. వీరు దారకొండ నుంచి ట్రాక్టర్​పై వెళ్తుండగా.. కొంగ పాకల తాత్కాలిక కల్వర్టు వద్ద ట్రాక్టర్​ ప్రవాహంలో చిక్కుకుంది.

భారీ వర్షాలకు కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తుండగా.. వరద ఉద్ధృతికి ట్రాక్టర్​ మధ్యలోకి వెళ్లే సరికి ఒరిగిపోయి మట్టిలో కూరుకుపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురై.. రక్షించాలంటూ కేకలు వేశారు. సమీపంలోని గ్రామస్థులు అక్కడకు చేరుకుని వీరిని రక్షించారు. అనంతరం కాలినడకన గుమ్మిరేవుల చేరుకుని కార్యక్రమం నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details