గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేఖించిన జగన్ మోహన్ రెడ్డి నేడు అదే చట్టంతో పేదల భూములను ఎలా సేకరిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింగరావు ప్రశ్నించారు. అడుగడుగునా ల్యాండ్ పూలింగ్ను అడ్డుకుంటామని సీపీఎం ప్రకటించింది. ఈ ప్రక్రియ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 72 ను రద్దు చేయాలని కోరారు.
అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడెలా సమర్ధిస్తారు...? - go 72 latest news update
విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులు ల్యాండ్ పూలింగ్ గ్రామ సభలను వ్యతిరేకిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింగరావు అన్నారు. ఈ ప్రక్రియ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 72 ను రద్దు చేయాలని కోరారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో విశాఖ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ల్యాండ్ పూలింగ్‌కు సమస్యలు ఎదురు కానున్నాయి.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింగరావు
TAGGED:
జీవో నెంబర్ 72 తాజా వార్తలు