ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గానుగాటకు సిద్ధమైన గోవాడ చక్కెర కర్మాగారం - sugar factories in visakha news

విశాఖ జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న చక్కెర కార్మాగారాలు గానుగాటకు సిద్ధమవుతున్నాయి. గోవాడ చక్కెర కార్మాగారం ప్రారంభ పూజను యాజమాన్యం నిర్వహించింది.

sugar factory
చక్కెర కార్మాగారం ప్రారంభపూజ

By

Published : Nov 26, 2020, 1:10 PM IST

విశాఖ జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న మూడు చక్కెర కర్మాగారాలు 2020 - 21వ సంవత్సరానికి గానుగాటకు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు గోవాడ చక్కెర కార్మాగారం ప్రారంభ పూజ జరిపించారు. కర్మాగారం యాజమాన్య సంచాలకులు వి.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

ఈ ఏడాది 4.5 లక్షల టన్నుల చెరకును గానుగ పట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సన్యాసినాయుడు తెలిపారు. నేటి నుంచి పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేశామన్నారు. వ్యవసాయాధికారి, పరిపాలనాధికారి, గుర్తింపు యూనియన్ నాయకులు, కర్మాగారం ఉన్నతాధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details