రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రివెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో యశ్వంత్‌పుర్- హౌరా ఎక్స్‌ప్రెస్(Yeshwantpur- Howrah Express)లో బంగారాన్ని తరలిస్తున్నాడన్న సమాచారం మేరకు.. విశాఖ రైల్వే స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం అధికారులు మాటువేశారు.
రైలు రాగానే.. అందులోకి ప్రవేశించి.. నిందితుడిని తనిఖీ చేశారు. అతని వద్ద ఏకంగా.. రూ.1.91 కోట్లు విలువ చేసే 3.89 కిలోల బంగారం బయటపడింది. నిందితుడు కోల్‌కతా నుంచి ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.