ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊరెళ్లి వచ్చేసరికి ఊడ్చేశారు... - theft in locked house at anakapalli

కరోనా, భారీ వర్షాలతో సతమతమవుతున్న ప్రజలపై దొంగలు తమ ప్రతాపం చూపుతున్నారు. ఇల్లు వదిలి బయటకు వెళ్తే చాలు.. వచ్చేసరికి మొత్తం ఊడ్చేస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన అజీజునీసాకు ఇదే పరిస్థితి ఎదురైంది.

theft in locked house
తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ

By

Published : Oct 22, 2020, 7:09 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని సాయి కాలనీలో చోరీ జరిగింది. మూడు తులాల బంగారం, 90 తులాల వెండి వస్తువులను అపహరించారు. తాళం పగులగొట్టి దుండుగులు దొంగతనానికి పాల్పడ్డారు.

అజీజునీసా అనే మహిళ.. భర్తతో కలిసి ఈనెల 16న విశాఖపట్నం వెళ్లింది. బుధవారం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులకు తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details