ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీలేరు నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల

సీలేరు జలాశయం నుంచి మొట్టమొదటి సారిగా గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ పంట నీటికి ఆధారమైన ధవళేశ్వరం బ్యారేజ్​నుంచి 2 గేట్లు ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.

'సీలేరు నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల'

By

Published : Mar 19, 2019, 6:17 PM IST

'సీలేరు నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదల'
విశాఖ జిల్లా సీలేరు జలాశయం నుంచి మొట్టమొదటి సారిగా గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ పంట నీటికిఆధారమైన ధవళేశ్వరం బ్యారేజ్​లో నీటి నిల్వలు తగ్గడంతో రెండు గేట్లు ఎత్తి 3వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.గత డిసెంబర్ 1నుంచి గోదావరి డెల్టా కోసం సీలేరు నుంచి నీటిని పంపిస్తున్నారు.అయితే... ధవళేశ్వరం బ్యారేజిలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటం వల్ల తక్కువ మొత్తంలో నీటిని వాడుకునేవారు. ఇటీవల కాలంలో ధవళేశ్వరానికి ఇన్ ఫ్లో తగ్గిన కారణంగా సీలేరు మీద ఆధారపడాల్సి వచ్చింది.

గోదావరి డెల్టాకు నీరు అందించే డొంకరాయి జలాశయంలో నీటి మట్టం 997 అడుగులకు పడిపోయిన కారణంగా.. అక్కడి నుంచి నీటి విడుదల సాధ్యపడలేదు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కోసం పవర్ కెనాల్ ద్వారా సుమారు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా..ఆ నీరు అవసరాలు తీర్చడం లేదు. ఈ పరిస్థితుల్లోరాష్ట్ర ప్రభుత్వం నేరుగా చొరవ తీసుకుని సీలేరు జలాశయం నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయించింది. ఈ మేరకు ఏపీ జెన్కో అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details