ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొప్ప అవకాశం.. భక్తుల చెంతకే సింహాద్రి అప్పన్న

అప్పన్నస్వామిని దర్శించుకోవటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కానీ మూడు నెలలు స్వామివారు నేరుగా ప్రజల చెంతకే చేరి దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ప్రచార రథంలో భాగంగా భక్తుల వద్దకే అప్పన్న స్వామి

By

Published : Nov 1, 2019, 9:33 PM IST

ప్రచార రథంలో భాగంగా భక్తుల వద్దకే అప్పన్న స్వామి

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ వరవానరసింహస్వామి భక్తుల వద్దకు బయలుదేరారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా అప్పన్నస్వామి నేరుగా భక్తుల దగ్గరకు వెళ్లి దర్శన భాగ్యం కల్పించనున్నారు. శుక్రవారం దేవస్థాన ఈఓ ఎం.వెంకటేశ్వరరావు స్వామివారి ప్రచార రథమును ప్రారంభించారు. సుమారు మూడు నెలలపాటు కోస్తాంధ్రలోని 3 జిల్లాల భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి... పార్వతీపురం, బొబ్బిలి మొదలగు ప్రాంతాల నుంచి తిరుగు ప్రయాణమై 24 జనవరి 2020 నాటికి కొత్తవలస, పెందుర్తి మీదుగా సింహాచలంలోని సింహగిరిపైకి చేరు కుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details