GITAM Admission Test: గీతం డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన విశాఖ, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్లో జీఏటీ-2023 అడ్మిషన్లకుగాను ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డి.ఎస్.రావు తెలిపారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.రావు వివరాలను తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 48 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నట్లు డి.ఎస్.రావు వెల్లడించారు. విశ్వవిద్యాలయం జీఏటీ, జేఈఈ మెయిన్, ఏపీ, టీఎస్ సెట్స్‌లలో అగ్రర్యాంకులు సాధించిన విద్యార్థులతోపాటు అర్హులైనవారికి మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేయన్నుట్లు డి.ఎస్.రావు చెప్పారు.
'గీతం విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మేనేజ్ మెంట్, ఫిజయోథెరఫీ కోర్సులలో వేటిలో అయినా చేరాలనుకునే వారు ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. గీతం విశ్వవిద్యాలయం మొత్తం 153 కోర్సులను అందిస్తుంది. ఈ ప్రవేశ పరిక్షలో ప్రతిభ కనబరిచే వారికి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు స్కాలర్షిప్ లభిస్తాయి. వంద మార్కులకు రెండు గంటల పాటు పరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో కంప్యూటర్ బెస్డ్ టెస్ట్‌కి హాజరు కావాల్సి ఉంటుంది.'- గీతం యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డి.ఎస్.రావు