ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు.. రెండురోజుల్లో 352 అవగాహనా ఒప్పందాలు - GIS 2023

GIS 2023 concludes: విశాఖ వేదికగా నిర్వహించిన రెండ్రోజుల... ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. ఈ సదస్సులో సుమారు రూ.13లక్షల 5 వేల కోట్ల విలువైన, 352 అవగాహనా ఒప్పందాలు కుదిరాయని సీఎం వెల్లడించారు. ఈ ఎంవోయూలు వాస్తవ రూపం దాల్చేందుకు సరళీకృత విధానాలు అవలంబిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 4, 2023, 9:38 PM IST

Updated : Mar 5, 2023, 6:24 AM IST

GIS 2023: విశాఖ వేదికగా నిర్వహించిన రెండ్రోజుల... ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. రెండో రోజు ఫార్మా, గ్రీన్‌కో, పర్యాటకం, పెట్రోలియం, ఇరిగేషన్‌, నైపుణ్యాభివృద్ధి, టెక్స్‌టైల్‌ సహా...వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలతో ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. సదస్సుకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్వానంద్‌ సోనువాల్‌.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోదీ సారథ్యంతో వివిధ రాష్ట్రాల్లో విదేశీ పెట్టుబడులకు అనువైన అవకాశం ఏర్పడిందని.. కిషన్‌రెడ్డి అన్నారు.

'ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందుతోంది. మూడు పారిశ్రామిక కారిడార్‌లు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక నడవాలు ఏపీ నుంచే వెళతున్నాయి. ఎన్నో ఆకర్షణీయ అవకాశాలు ఉన్నందున దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. రికార్డు స్థాయిలో పెట్టుబడిదారులు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీతో పాటు భారత దేశ అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వారందరికీ అభినందనలు.'-కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

రాష్ట్రంలో పోర్టులు, రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ను విశేషంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్‌ చెప్పారు.

సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.1 లక్షల కోట్ల విలువైన 110కి పైగా ప్రాజెక్టులు చేపడుతున్నాం. వీటిలో రూ.32 వేల కోట్ల విలువైన 35 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏపీ ప్రభుత్వం.. విశాఖ పోర్టును అభివృద్ధి చేసి పర్యాటకంగా ప్రగతి సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నా. శర్బానంద్ సోనోవాల్‌, కేంద్ర మంత్రి


రెండ్రోజుల సదస్సులో వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్లో అధికశాతం పునరుత్పాదక ఇంధన రంగానికి చెందినవేనని సీఎం వెల్లడించారు. పెట్టుబడుల సదస్సు ఫలప్రదమైంది. సుమారు రూ.13లక్షల 5 వేల కోట్ల విలువైన, 352 అవగాహనా ఒప్పందాలు కుదిరాయని సీఎం వెల్లడించారు. ఒక్క ఇంధన రంగంలోనే 40 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.8,84,823 కోట్లు కాగా ఉంటుందన్నారు. లక్షా 90 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే అవకాశం లబిస్తుందని సీఎం పేర్కొన్నారు.

ఈ ఎంవోయూలు వాస్తవ రూపం దాల్చేందుకు సరళీకృత విధానాలు అవలంబిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. దీని కోసం... సీఎస్‌, సీంవో అధికారులు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో కూడిన ఓ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు జగన్ తెలిపారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఎంవోయూలు అమలయ్యేలా కృషిచేస్తాయని సీఎం పేర్కొన్నారు. సదస్సు ముగింపు సందర్భంగా... శ్రీసిటీ, అచ్యుతాపురం, విజయవాడ, కంకటాపల్లి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలకు చెందిన 14 యూనిట్లను.. వర్చువల్‌గా జగన్‌ ప్రారంభించారు.

విశాఖలో ముగిసిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు

ఇవీ చదవండి:

Last Updated : Mar 5, 2023, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details