ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలో పడి బాలిక దుర్మరణం - girl dead in visakha agency latest news

ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి ఏడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా జి.మాడుగులలోని గొందిమెలక గ్రామంలో విషాదం నింపింది. బట్టలు ఉతకడానికి అని స్నేహితులతో కలిసి గెడ్డ దగ్గరకు వెళ్లిన బాలిక... కాలుజారి నీళ్లలో మునిగి దుర్మరణంపాలైంది.

girl dead felldown  in canal at g madugula
కాలువలో పడి బాలిక దుర్మరణం

By

Published : May 21, 2020, 12:37 PM IST

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని వంజరి పంచాయతీ గొందిమెలక గ్రామానికి చెందిన వంతాల చిన్నారి.. గెడ్డలో పడి మృతి చెందింది. కశింకోట పాఠశాలలో జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న బాలిక.. స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లింది.

ప్రమాదవశాత్తు చిన్నారి కాలుజారి కాలువలో పడి ప్రాణాలు విడిచింది. స్నేహితులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా... గ్రామస్తులతో వెళ్లి మృతదేహాని బయటకు తీశారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details