విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం ఆర్. కొత్తూరు గ్రామానికి చెందిన రెడ్డి హర్షిత.. శనివారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని తాండవ కుడి కాలువ వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయింది. గ్రామస్థులు కాలువలో వెతుకుతుండగా ఆదివారం ఉదయం గ్రామానికి మూడు కిలోమీటర్లు దూరంలో హర్షిత మృతదేహం లభ్యమైంది. ఊహించని ఈ ఘటనతో హర్షిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలిక మృతి - news updates in vizag district
విశాఖపట్నం జిల్లా ఆర్.కొత్తూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రమాదవశాత్తు తాండవ కుడి కాలువలో పడి మృతి చెందింది.
ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలిక మృతి